అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై దుమారం! - akhilesh yadav remarks on terror arrests sparks row
close
Published : 13/07/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై దుమారం!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ శివార్లలో అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరుల అరెస్ట్‌ రాజకీయ రంగు పులుముకుంది. వారి అరెస్ట్‌పై అనుమానాలు వ్యక్తంచేసేలా ‘యూపీ పోలీసులపైనా, భాజపా ప్రభుత్వంపైనా నమ్మకం లేదు’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అఖిలేశ్‌ వ్యాఖ్యలపై భాజపా ఖండించింది.

అల్‌ఖైదా అనుబంధ ఉగ్రముఠా అన్సర్‌ ఘజ్వతుల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను యూపీ ఏటీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో ‘యూపీ పోలీసులపై నమ్మకం లేదు’ అంటూ ఆదివారం అఖిలేశ్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే, అఖిలేశ్‌ మాట్లాడే సమయానికి ఉగ్రవాదుల అరెస్ట్‌ ఘటన జరగలేదని, అఖిలేశ్‌కు చెడ్డ పేరు తెచ్చేందుకు ఎడిట్‌ చేసిన క్లిప్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ పేర్కొంది.

గతంలో భాజపా వ్యాక్సిన్‌ అంటూ విమర్శలు చేసిన అఖిలేశ్‌.. ఇప్పుడు అరెస్టులపై రాజకీయాలు చేస్తున్నారంటూ భాజపా మండిపడింది. ‘యూపీ పోలీసులు, భాజపా ప్రభుత్వంపై కాకుండా పాకిస్థాన్‌ ప్రభుత్వం, అక్కడి ఉగ్రవాదులపై మీకు నమ్మకం ఉందా?’ అని ఆ పార్టీ నేత సీటీ రవి ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేని ఓ వ్యక్తి సీఎం కావాలని ఎలా కోరుకుంటున్నారని మరో నేత అమిత్‌ మాలవీయ నిలదీశారు. మరోవైపు అఖిలేశ్‌ తరహాలోనే బీఎస్పీ అధినేత్రి మాయవతి సైతం అరెస్టులపై అనుమానం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ అరెస్టులు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని