ముంబయి పోలీసులకు అక్షయ్‌ సాయం - akshay donate health watches to mumbai police
close
Published : 03/08/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయి పోలీసులకు అక్షయ్‌ సాయం

ముంబయి: కరోనా సంక్షోభంలో సినీ ప్రముఖులు ఎంతో మంది తమవంతు సాయం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రారంభించిన పీఎం కేర్‌ ఫండ్‌కు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అయితే ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చాడు. ఆ తర్వాత ముంబయి కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు ప్రకటించాడు. అంతటితో అక్షయ్‌ ఆగలేదు. కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముంబయి పోలీసులకు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. తాజాగా అదే ముంబయి పోలీసులకు అక్షయ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లు అందజేశాడు. ఈ డివైజ్‌ ధరిస్తే ఆక్సిజన్‌, శరీర ఉష్ణోగ్రత, హర్ట్‌  రేట్‌ తెలిసిపోతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అక్షయ్‌ ఈ డివైజ్‌లను విరాళంగా ఇచ్చాడు. 

అక్షయ్‌ చేసిన సాయాన్ని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ ఆయన్ను ప్రశంసించారు. ముంబయి పోలీసులకన్నా ముందు నాసిక్‌ పోలీసులకు సైతం అక్షయ్‌ ఈ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను అందజేశారని వెల్లడించారు.‘‘అక్షయ్‌ గారు ఎల్లప్పుడు సైన్యానికి, వివిధ రాష్ట్రాల్లోని పోలీసులకు ఎంతో మద్దతుగా ఉంటారు. కొవిడ్‌ వారియర్స్‌పై ఆయన చూపించిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ డివైజ్‌లను బీఎంసీ ఉద్యోగులకు ఇచ్చే విషయంపై కూడా చర్చించాం’’అని ఆదిత్య ఠాక్రే ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నెలలో నటుడు సోనూ సూద్‌ కూడా ముంబయి పోలీసులకు 25వేల ఫేస్‌ షీల్డ్స్‌ విరాళంగా ఇచ్చాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని