అక్షయ్ ‘ది ఎండ్‌’ షో ఈ ఏడాది లేనట్టే! - akshay kumar about his son
close
Published : 02/08/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్ ‘ది ఎండ్‌’ షో ఈ ఏడాది లేనట్టే!

ముంబయి: ప్రముఖ హిందీ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ‘ది ఎండ్‌’ అనే డిజిటల్‌ షోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రారంభం రోజు సూట్‌ ధరించి ఒంటినిండా మంటలతో వేదికపైకొచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ షోని ఈ ఏడాది చివరల్లో పూర్తిస్థాయిలో మొదలుపెడదాం అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. దీంతో వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో దీన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఈ షో గురించి అక్షయ్‌ మాట్లాడుతూ ‘‘కొత్త ప్రయోగాలను నేను బలంగా నమ్ముతాను. నా కెరీర్‌లో అలాంటివి చేస్తూనే ఉన్నాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాను. అలాగే ఈ షో కూడా ఎంతో కొత్తగా ఉంటుంది. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ షోలో ఎప్పుడు పాల్గొంటానా? అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను డిజిటల్‌ తెరపైకి వస్తున్నా అనగానే మా అబ్బాయి ఆరవ్‌ ఓ సలహా ఇచ్చాడు. ‘నాన్నా.. యువతరానికి ఎక్కువగా నచ్చేలా నీ షో ఉండాలి’’అన్నాడు. అందుకే యువతకు బాగా దగ్గరయ్యే అంశాలతో ఈ షో ఉండబోతుంది’’అని చెప్పారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని