అక్షయ్‌ క్షేమంగా ఉన్నారు: ట్వింకిల్ - akshay kumar back home after testing negative for covid-19 twinkle khanna confirms‌
close
Published : 12/04/2021 23:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ క్షేమంగా ఉన్నారు: ట్వింకిల్

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇటీవల‌ కొవిడ్‌ భారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వారం రోజుల తర్వాత ఆయన ఇవాళ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇదే విషయాన్ని ట్వింకిల్‌ ఖన్నా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన భర్తతో కలిసి ఉన్న ఓ కార్టూన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ..‘‘ఆయన ఇంటికి తిరిగొచ్చారు. సురక్షితంగా..ఉన్నారు’’ అని రాసుకొచ్చింది.

 అక్షయ్‌ తనకు కరోనా సోకినట్లు  ఏప్రిల్ 4న ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఏప్రిల్‌ 5న ఆసుపత్రిలో చేరారు. ‘‘నా క్షేమం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను.  వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్త చర్యగా నేను ఆసుపత్రిలో చేరాను. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాను’ తెలిపారు.  ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ‘రామ్‌సేతు’ ‘బచ్చన్‌పాండే’, ‘అత్రాంగి రే’ చిత్రాల్లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని