పృథ్వీరాజ్‌ కోసం సెట్లోకి - akshay kumar returns to the sets of prithviraj to shoot for vfx
close
Published : 14/06/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పృథ్వీరాజ్‌ కోసం సెట్లోకి

ముంబయి: అక్షయ్‌కుమార్‌ కోసం పలు భారీ చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన చిత్రాల్ని పూర్తి చేయడానికి అక్షయ్‌తో పనిచేస్తున్న దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన అక్షయ్‌ సెట్లోకి అడుగుపెట్టినట్టు బాలీవుడ్‌ సమాచారం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాల చిత్రీకరణలో అక్షయ్‌ పాల్గొన్నట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యమున్న కథతో వస్తోన్న ఈ సినిమా విడుదలకు ముందే
వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని కర్ణిసేన డిమాండ్‌ చేస్తోంది. ఈ చిత్రంలో మానుషీ చిల్లర్‌ రాజకుమారి సంయోగితగా నటిస్తోంది. సంజయ్‌ దత్‌, సోనూసూద్‌, అశుతోష్‌ రాణా, సాక్షి తన్వర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చంద్రప్రకాష్‌ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. అక్షయ్‌ నుంచి రానున్న మరో చిత్రం ‘రక్షాబంధన్‌’. ఈ సినిమా సెట్లోకి కూడా ఈ నెల మూడోవారంలో అడుగుపెట్టడానికి అక్షయ్‌ సన్నాహలు చేసుకుంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని