లవ్ స్టోరీ గురించి బయటపెట్టిన స్టార్ హీరో
వైరల్‌గా మారిన ఒకనాటి వీడియో
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్.. నటి ట్వింకిల్ ఖన్నాను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట వివాహ 20వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది కూడా. అయితే, ట్వింకిల్ ఖన్నా కంటే ముందు తన జీవితంలో ఓ బ్రేకప్ ఉందని ఒకానొక సందర్భంలో అక్షయ్ వివరించారు. 2019లో విడుదలైన కామెడీ హంగామా ‘హౌస్‌ఫుల్-4’. అక్షయ్, రితేశ్ దేశ్‌ముఖ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం ‘కపిల్‌శర్మ షో’లో పాల్గొంది.
కపిల్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఒకానొక సమయంలో నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అప్పట్లో తనని రెస్టారంట్లు, సినిమాలకు తీసుకువెళ్లేవాడిని. అలా మేమిద్దరం కలిసి నాలుగుసార్లు డేట్‌కు వెళ్లాం. అయితే, అప్పట్లో నాకున్న సిగ్గు కారణంగా నేను ఆమె చేతిని ఒక్కసారిగా కూడా తాకలేదు. అలాగే ముద్దు కూడా పెట్టుకోలేదు. దీంతో ఆ అమ్మాయి.. ఏ విధంగానూ నేను ప్రేమ చూపించడంలేదని నాకు బ్రేకప్ చెప్పేసింది.’ అని అక్షయ్ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ మారింది.
ఇదీ చదవండి
వీడియో లీక్.. రూ.25 కోట్లు డిమాండ్
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’