Akshay Kumar: సామాజిక సమస్యపై చిత్రం తీస్తున్నాం.. ఆశీర్వదించండి: అక్షయ్‌ - akshay kumar shares omg 2 update will reflect on important social issue
close
Published : 23/10/2021 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay Kumar: సామాజిక సమస్యపై చిత్రం తీస్తున్నాం.. ఆశీర్వదించండి: అక్షయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీటౌన్‌లో ప్రయోగాత్మక, సందేశాత్మక, సామాజిక సమస్యలపై ప్రజలను ఆలోజింపజేసే చిత్రాల్లో నటించేందుకు ముందుంటారు అక్షయ్‌. ఈసారి ఆయన ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను తెరపై చూపించేందుకు ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఇదే విషయాన్ని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘‘నిజాయతీతో కూడిన ప్రయత్నమే ఈ చిత్రం. ఆ ఆదియోగి ఆశీర్వాదాలు మా ప్రయాణమంతా ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి’’ అన్నారు. నటులు పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ఈచిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. 2012లో విడుదలైన ‘ ఓ మై గాడ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోంది ఈ చిత్రం. అమిత్‌ రాయ్ ఈ సినిమాకి కథ, దర్శకత్వం అందించనున్నారు. కేప్‌ ఆఫ్‌ గాడ్‌ ఫిల్మ్‌ సంస్థ నిర్మిస్తోంది. హిందీలో ‘ఓ మై గాడ్‌’గా వచ్చిన ఈ చిత్రం.. 2015లో తెలుగులో పవన్‌ కల్యాణ్‌, వెంకటేశ్‌ ‘గోపాలా గోపాలా’ పేరుతో రీమేక్‌ అయ్యింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని