గోవింద.. అక్షయ్‌లకు కరోనా - akshay kumar tested positive for covid19
close
Published : 04/04/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోవింద.. అక్షయ్‌లకు కరోనా

ముంబయి: బీటౌన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ నటీనటులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, మాధవన్‌, ఆమిర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు కొవిడ్‌-19 బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌, నటుడు గోవిందలు కరోనా బారిన పడ్డారు. అక్షయ్‌ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు‌. ‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధలోకి వెళ్లాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. గోవింద ఆరోగ్య పరిస్థితి కూడా స్థిరంగానే ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో దాని ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంది. రికార్డుస్థాయిలో అక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని