Akshay Kumar: ‘బెల్‌ బాటమ్‌’ మూవీ పోస్టర్‌ కాపీ కొట్టారా..? - akshay kumars bell bottom poster copy of insta influencers viral pic from sri lanka
close
Published : 06/08/2021 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay Kumar: ‘బెల్‌ బాటమ్‌’ మూవీ పోస్టర్‌ కాపీ కొట్టారా..?

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, వాణీ కపూర్‌ జంటగా నటిస్తున్న‘బెల్‌ బాటమ్‌’ ఫస్ట్‌ సాంగ్‌ పోస్టర్‌ను కాపీ కొట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలోని ‘మర్‌జావాన్‌’ అనే ఫస్ట్‌ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు. రైలు డోర్‌ నుంచి బయటకు వంగిన అక్షయ్‌కుమార్‌పై వాణీ కపూర్‌ కాలు మోపినట్లుగా ఆ పోస్టర్‌ ఉంటుంది.

ఇది అచ్చం ట్రావెల్‌ కపుల్‌గా పేరొందిన కెమిల్లే డెమిట్టెనెరే తన భాగస్వామి జీన్‌ హక్‌తో కలిసి 2019లో శ్రీలంక టూర్‌కు వెళ్లినపుడు దిగిన ఫొటోను పోలి ఉందని సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆమె ఆ ఫొటోను 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. అది చూసిన నెటిజన్లు ఆ పోస్టర్‌ను అక్కడి నుంచే కాపీ కొట్టారని ఆ రెండు ఫొటోలను పక్కపక్కన పెడుతూ ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై ప్రముఖ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ సమీర్‌ బెల్వాల్కర్ స్పందిస్తూ.. ‘నేను కూడా కొన్ని సినిమాల్లో  పోలి ఉండే ఫొటోలను తీశాను. కొన్ని సందర్భాల్లో మనం తీసిన ఫొటోలు అలా మ్యాచ్‌ అవుతుంటాయి’ అని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు కామెంట్‌ చేశాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని