కరోనా కాలం.. అక్కడి వృద్ధులకు అలారం - alarm device for chinese in nyc for hate crimes
close
Published : 27/08/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కాలం.. అక్కడి వృద్ధులకు అలారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చైనాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులను వేధించడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయట. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ సిటీలోని చైనా టౌన్‌లో వృద్ధ చైనీయుల రక్షణ కోసం అక్కడి యువత ఒక విధమైన అలారం పరికరాలను తయారు చేయిస్తోంది.

కరోనా వ్యాప్తికి చైనా దేశం కారణమంటూ అమెరికాలో ఉండే చైనీయులపై అక్కడి ప్రజలు వివక్ష చూపిస్తున్నారట. వారి వల్లే అమెరికాలోకి కరోనా ప్రవేశించిందని ఆరోపిస్తూ భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారట. ఇలాంటి ఘటనలను చూసిన న్యూయార్క్‌ చైనా టౌన్‌లోని కొందరు యువతీయువకులు వృద్ధుల రక్షణ గురించి ఆలోచించారు. వయసులో ఉన్నవారు దాడిని ప్రతిఘటించే అవకాశముంది. కానీ వృద్ధులను కాపాడటం ఎలా అనే సమస్యకు పరిష్కారం ఆన్వేషించారు. దానికి ఫలితమే ఈ అలారం పరికరం. ఇందుకోసం మార్చిలో చైనా టౌన్‌లోని యువతీయువకులు స్థానికులకు సమస్యను వివరించి పరికరం తయారీకి ఆర్థిక సాయం కోరారు. అక్కడి ప్రజలు సహాయం చేయడంతో ‘సేఫ్‌ ఫ్రమ్‌ హేట్‌’ కార్యక్రమం చేపట్టారు.

ఇందులో భాగంగా ఈ పరికరాలను తయారు చేయించి.. వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు. ఈ అలారం పరికరాన్ని వృద్ధులు ఎల్లప్పుడు వారి వద్దనే ఉంచుకోవాలి. దుండగులు దాడి చేసేందుకు వస్తే వెంటనే ఈ పరికరంలోని మీట నొక్కాలి. అది నొక్కగానే దాదాపు 125 డెసిబుల్స్‌తో శబ్దం వినిపిస్తుందట. ఆ శబ్దానికి దుండగులు కాస్త బెదిరిపోయి అచేతనంగా ఉండిపోతారని, ఆ సమయంలో వారి నుంచి తప్పించుకొని బయటకు రావొచ్చని చెబుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని