Bollywood: గంగూబాయి సెట్లోకి 15న? - alia bhatt gangubai kathiawadi first to resume shoot in mumbai
close
Published : 09/06/2021 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: గంగూబాయి సెట్లోకి 15న?

ముంబయి: అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అలియా వేశ్యావాటిక నిర్వాహకురాలిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా దీని చిత్రీకరణ పూర్తి కాలేదు. కొవిడ్‌ ప్రభావంతో సినిమాపై ఎక్కువగానే పడింది. కొవిడ్‌ రెండో దశ మొదలుకాకముందే చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం రాలేదు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గంగూబాయి బృందం చిత్రీకరణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 15 నుంచి షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని