alia bhatt: ‘గంగూబాయి’.. రెండేళ్లకు పూర్తి - alia bhatt gangubai kathiawadi shoot wrapped directed by sanjay leela bhansali
close
Published : 27/06/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

alia bhatt: ‘గంగూబాయి’.. రెండేళ్లకు పూర్తి

ముంబయి: ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది చిత్ర బృందం. గత రెండేళ్లుగా గంగూబాయి పాత్రతో ప్రయాణం చేసిన ఆలియా షూటింగ్‌ ముగియడంతో భావోద్వేగానికి గురైంది. ‘‘2019 డిసెంబరు 8న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. సుమారు రెండేళ్లకు పూర్తయింది. ఈ మధ్యలో రెండు సార్లు లాక్‌డౌన్‌ వచ్చింది. దర్శకుడు నేనూ కొవిడ్‌ బారిన పడ్డాం. సంజయ్‌ దర్శకత్వంలో పనిచేయడం నా కల. అలాంటిది ఆయనతో ఇలా రెండేళ్ల ప్రయాణం సాగుతుందని నేను ఊహించలేదు. థాంక్యూ సంజయ్‌ సర్‌. మీలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఈ రోజు సెట్‌ని వదిలివెళ్తుంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. గంగూ.. ఐ లవ్‌ యు! సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన సాంకేతిక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని పేర్కొంది ఆలియా.

భన్సాలీ ప్రొడక్షన్స్‌, పెన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంచిత్‌ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని