సితారకు ఆలియా కానుక.. ఏంటంటే? - alia bhatt special gift to sitara
close
Published : 07/12/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సితారకు ఆలియా కానుక.. ఏంటంటే?

హైదరాబాద్‌: తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్‌ కథానాయిక ఆలియా భట్‌ ప్రత్యేక కానుక ఇచ్చారంటూ మురిసిపోతోంది అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుమార్తె సితార. ఈ చిన్నారికి ఆలియా భట్‌ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. 2018 అక్టోబరులో ‘మహర్షి’ సినిమా షూటింగ్‌ కోసం మహేశ్‌బాబు కుటుంబంతో పాటు న్యూయార్క్‌ వెళ్లారు. అదే సమయంలో ఆలియా కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని సితార తన అభిమాన తారను కలిసింది. వీరిద్దరి ఫొటోను నమ్రత అప్పట్లో పంచుకున్నారు.

ఇప్పుడు ఆలియా తొలిసారి దక్షిణాది చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆమె సోమవారం హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలో సితార కోసం తన సొంత బ్రాండ్‌ నుంచి దుస్తులు తీసుకొచ్చారు. ‘నాకెంతో ఇష్టమైన నటి నా కోసం వీటిని తీసుకొచ్చింది. ఈ క్యూట్‌ డ్రెస్‌ పంపినందుకు ధన్యవాదాలు ఆలియా భట్‌. నాకెంతో నచ్చింది, చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఈ సందర్భంగా సితార ఫొటోలు పంచుకుంది. నమ్రత కూడా ఆలియాకు థాంక్స్‌ చెప్పారు.

ఇవీ చదవండి..
సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!
చాలా మంది నెటిజన్లు నన్ను ద్వేషిస్తున్నారు..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని