బ్యాగ్రౌండ్‌ ఉన్నా.. ఆడిషన్‌కు వెళ్లి ఒక్క ఛాన్స్‌ అడిగి - aliabhatt birthday story
close
Updated : 15/03/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాగ్రౌండ్‌ ఉన్నా.. ఆడిషన్‌కు వెళ్లి ఒక్క ఛాన్స్‌ అడిగి

బర్త్‌డే స్పెషల్‌: ఆలియాభట్‌ గురించి కొన్ని విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అందం, అభినయం, బ్యూటిఫుల్‌ లుక్స్‌తో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు నటి ఆలియాభట్‌. నటన మీద ఉన్న మక్కువతో మొదటి సినిమా కోసమే 16 కిలోల బరువు తగ్గిన ఈ భామ ప్రస్తుతం బీటౌన్‌లో స్టార్‌గా రాణిస్తున్నారు. సోమవారం ఆలియాభట్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్‌, లైఫ్‌స్టైల్‌ గురించి ఆలియా పలు సందర్భాల్లో ఇలా చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీకోసం..

నాన్న అంటే కోపం..!

‘‘నాన్న మహేశ్‌భట్‌ బాలీవుడ్‌లో పెద్ద నిర్మాత. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఆయన బిజీగా ఉండేవారు. దాంతో చిన్నప్పుడు ఆయన్ని బాగా మిస్‌ అయ్యేదాన్ని. ఒక్కోసారి ఆయనపై బాగా కోపం వచ్చేది. నటి అయ్యాక నాక్కూడా పరిశ్రమలో ఉండేవారి కష్టాలు అర్థమయ్యాయి. నాన్న తీరిక లేకుండా గడుపుతున్నారని అర్థమైంది. ఆయనే నా రోల్ మోడల్. అమ్మ సోనీ రజ్దాన్‌ నటి. ఆమే నా స్ఫూర్తి ప్రదాత’’


బరువు తగ్గకతప్పలేదు..!

‘‘నాన్న పేరు లేకుండా స్వతహాగా సినిమాల్లో రాణించాలని అనుకున్నాను. అందుకే, అందరి నటీనటులు మాదిరిగానే ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నా తొలి ప్రాజెక్ట్‌. ఆ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్న 400 మందిలో నేను ఒకదాన్ని. ఆడిషన్స్‌లో సెలక్ట్‌ అయ్యాక మూడు నెలల్లో 16 కిలోల బరువు తగ్గా’’


బాబోయ్‌ భయం..!

‘‘చిన్నప్పటి నుంచి నాకు చీకటి అంటే భయం. ఆ భయాన్ని జయించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యా. అందుకనే రాత్రుళ్లు నిద్రపోయేటప్పుడూ పడకగదిలో లైట్లు వేసుకునే పడుకుంటా. చీకటి ఒక్కటే కాదు.. ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాలంటేనూ నాకు భయమే’’


వాళ్లని గౌరవిస్తా కానీ..

‘‘పెళ్లి, ప్రేమ అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో, ఎవరితో రిలేషన్‌షిప్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలో అంతా నా స్వవిషయం. దానిలో ఇతరుల ప్రమేయం అనవసరం. ఈ విషయంలో మా పేరెంట్స్‌ అభిప్రాయాలను గౌరవిస్తానే తప్ప అమలు చేయాలనుకోను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా’’


పెయింటర్ కమ్‌ సింగర్‌

‘‘నటిని కాకపోయి ఉండి ఉంటే  గాయని అయ్యేదాన్ని. పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే పెయింటింగ్‌ కూడా. ఖాళీ సమయంలో చార్‌కోల్ పెయింటింగ్ వేస్తుంటాను’’


రాజమౌళి సర్‌.. ఒక్కఛాన్స్..!

‘‘ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి సార్‌ను కలిశాను. ‘మీరు తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ అవకాశం ఇవ్వండి. కాల్షీట్లు కూడా సర్దుబాటు చేసుకుంటాను’ అని సర్‌తో చెప్పాను. ఆ తర్వాత ‘సీత’ పాత్రలో అవకాశమిస్తున్నట్లు కాల్‌ చేసి చెప్పారు. ఆ పాత్ర నాకెంతో నచ్చింది. తెలుగులో శిక్షణ తీసుకున్నాను’’


రణ్‌బీర్‌ అంటే ఇష్టం..!

‘‘షారుఖ్‌ఖాన్‌, వరుణ్‌ధావన్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే అభిమాన హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రణ్‌బీర్‌ అంటే చాలా ఇష్టం. సెట్‌లో ఎంతటి షూట్‌ ఉన్నాసరే చాలా కూల్‌గా ఉంటాడు. వ్యక్తిగతంగా రణ్‌బీర్‌పై చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అతను ఎంతమంది నటీమణులతో చనువుగా ఉన్నా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అతని జీవితంలో నాది ప్రత్యేకస్థానం’’


మరికొన్ని విశేషాలు

*కొన్ని అనివార్య కారణాల వల్ల ‘ఆషికీ-2’ ఆఫర్‌ వదులుకున్నారట ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా విడుదలయ్యాక ఆఫర్‌ చేజార్చుకున్నందుకు ఎంతో బాధపడిందట ఆలియా.

*ఆలియాకు షూస్‌ అంటే ఎక్కువ పిచ్చి. షూట్‌ కోసం ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడి నుంచి షూ  కొనుగోలు చేస్తారట.

*ఆలియా భట్‌ భోజన ప్రియురాలు. చిరుతిళ్లు ఎక్కువగా తినడానికి ఆసక్తి కనబరుస్తుంటారు ఈ నటి.

*ఆమెకు పిల్లులు పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే మూడు పిల్లుల్ని పెంచుతోంది ఈ నటి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని