ఆలియాభట్‌కు కరోనా పాజిటివ్‌ - aliabhatt tested positive for corona
close
Published : 02/04/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ కొవిడ్‌-19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌మీడియాలో తెలియజేశారు. ప్రస్తుతానికి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితం తెలిసిన వెంటనే ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. వైద్యుల సూచనలు పాటిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దయచేసి జాగ్రత్తగా ఉండండి’ అని ఆలియా పేర్కొన్నారు. ఇక, సినిమా విషయానికి వస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూబాయ్‌ కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో ఆలియా నటిస్తున్నారు. మరోవైపు ఇటీవల పలువురు బీటౌన్‌ తారలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌కపూర్‌, మాధవన్‌, ఆమిర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ వాజ్‌పేయీలకు ఈ మధ్యకాలంలో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు ప్రతిఒక్కర్నీ కలవరపెడుతున్నాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలన్నింటినీ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని