‘ఆర్‌ఆర్‌ఆర్‌’: లేడీ విలన్‌ వచ్చేసింది! - alison doody Joins RRR Movie
close
Published : 03/11/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: లేడీ విలన్‌ వచ్చేసింది!

హైదరాబాబాద్‌: అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ నటులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐరిష్‌ అందాల భామ అలిసన్‌ డూడి ప్రతినాయికగా లేడీ స్కాట్‌ పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు తాజాగా ఆమె భారత్‌కు విచ్చేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లేడీ స్కాట్‌ ఇండియా వస్తుందంటూ రాసుకొచ్చారు. మరి అలిసన్‌ ఎప్పటి నుంచి షూట్‌లో పాల్గొంటారు? ఆమె పాత్ర ఎలా ఉంటుంది? తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా అలరించనున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరిస్‌లు కథానాయికలు. అజయ్‌దేవగణ్‌, శ్రియ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని