15రోజులు కోమాలో ఉన్నా: ముమైత్‌ఖాన్‌ - alitho saradaga funny chat show with actress mumaith khan
close
Updated : 20/02/2021 23:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15రోజులు కోమాలో ఉన్నా: ముమైత్‌ఖాన్‌

హైదరాబాద్‌: స్టార్‌డమ్‌ వచ్చిన తరువాత తనకేమీ కొమ్ములు రాలేదని నటి, డ్యాన్సర్‌ ముమైత్‌ఖాన్‌ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఫన్నీ టాక్‌ షో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు. బాలకృష్ణతో కలిసి ‘డిక్టేటర్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండగా జారి పడిపోయానని ముమైత్‌ తెలిపారు. తలకు గాయమవడంతో 15రోజుల పాటు కోమాలో ఉన్నట్లు వివరించారు.

రెండు రోజుల పాటు తల నుంచి రక్తం కారుతూనే ఉందని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని బాధపడ్డారు. మూడు సంవత్సరాలు డాక్టర్‌ విశ్రాంతి తీసుకోమంటే కేవలం మూడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు. ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలను చూడాలంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ సరదా ప్రోమోను చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని