ఈటీవీతో మా అనుబంధం మాటల్లో చెప్పలేము! - alitho saradaga with rojaramani and chakrapani latest promo
close
Updated : 13/07/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటీవీతో మా అనుబంధం మాటల్లో చెప్పలేము!

హైదరాబాద్‌: ఈటీవీతో తమకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని, అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దంపతులు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు గ్రేట్‌ పర్సన్‌ అని, తరుణ్‌ను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘మనసు మమత’తో పరిచయం చేసిన ఆయన, హీరోగా ‘నువ్వే కావాలి’లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చారని అన్నారు.

తనకు అలనాటి తార భానుమతి అంటే ఎంతో ఇష్టమని, ఆమె చాలా సరదాగా ఉండేవారని చక్రపాణి వివరించారు. రోజారమణిని రమణరావు అని పిలిచేవారని అప్పటి జ్ఞాపకాలను నవ్వుతూ పంచుకున్నారు. ఇక చిన్నప్పుడు తనకు పౌడర్‌ తినే అలవాటు ఉందని రోజారమణి చెప్పుకొచ్చారు.  స్విట్జర్లాండ్‌లో అగర్‌బత్తులు వెలిగించి పూజ చేస్తే, అగ్నిప్రమాదం జరిగిందేమోనని పోలీసులు వచ్చారని రోజారమణి చెప్పారు. ‘భక్తప్రహ్లద’లో తాను నటిస్తే, భక్తి తన భర్త, కొడుకుకు వచ్చిందన్నారు. ఇలా ఈ జంట పంచుకున్న అలనాటి మధుర జ్ఞాపకాలు, ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే సోమవారం(జులై 19) వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని