థియేటర్‌లో ఆ సినిమాని 72 సార్లు చూశా! - alitho saradga with sree vishnu
close
Published : 10/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్‌లో ఆ సినిమాని 72 సార్లు చూశా!

హైదరాబాద్‌: ‘కెరీర్‌ ప్రారంభంలో ఎవరు టాప్‌ దర్శకుడైతే వాళ్లతో సినిమా చేస్తే బాగుండేది అనుకునేవాణ్ని. తర్వాత పరిస్థితి అర్థమైంది’ అంటూ కథానాయకుడు శ్రీ విష్ణు తన సినీ ప్రయాణం గురించి చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి శ్రీ విష్ణు, దర్శకుడు అనిల్‌ రావిపూడి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో తనకు ప్రోత్సాహం అందించిన నటులు, హీరో కాకముందు ఏం చేశారు, ఎక్కువ సార్లు చూసిన సినిమా, నిర్మాతగా తన భార్య ఏ చిత్రాలు రూపొందించారు తదితర విషయాలు పంచుకున్నారు విష్ణు. రచయితగా తొలిసారి ఏ సినిమాకు పనిచేశారు, ‘గాలి సంపత్‌’ చిత్రానికి ఆ పేరేందుకు పెట్టారో వివరించారు అనిల్‌ రావిపూడి.  శ్రీ విష్ణుని అడిగే ప్రశ్నలకు అనిల్‌ చెప్పే సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. సినీ రంగంలో ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది.. శ్రీ విష్ణు వివాహం ఎలా జరిగింది తెలుసుకోవాలని ఉందా.. అయితే మార్చి 15వ తేదీ 9:30గంటల వరకు వేచి చూడాల్సిందే. మరి అప్పటిదాకా ఈ ప్రోమోను చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని