నెటిజన్లకు నిర్మాణ సంస్థ వార్నింగ్‌ - all abusive tweeters will be blocked says mytri movie makers
close
Published : 24/03/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెటిజన్లకు నిర్మాణ సంస్థ వార్నింగ్‌

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ తాజాగా నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది. అసభ్యంగా ట్వీట్లు పెడితే బ్లాక్‌ చేస్తానని హెచ్చరించింది. ‘ఉప్పెన’తో ఈ ఏడాది ఆరంభంలోనే విజయాన్ని సొంతం చేసుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్‌. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో అగ్ర కథానాయకులకు చెందిన కొన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. దీంతో సినీ ప్రియులందరి చూపు మైత్రి వైపే ఉంది. తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు కోరుతూ నెటిజన్లు మైత్రి మూవీస్‌కు ట్వీట్లు కూడా చేస్తున్నారు. అయితే, పలువురు మాత్రం అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేసింది. ‘అసభ్య పదజాలంతో ట్వీట్లు చేసే నెటిజన్ల ఖాతాలను ఇకపై బ్లాక్‌ చేస్తాం. హ్యాపీ సోషల్‌మీడియా స్పేస్‌ కోసం చేతులు కలుపుదాం’ అని పేర్కొంది.

ఇక మైత్రి ప్రాజెక్ట్స్‌ విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, మహేశ్‌తో ‘సర్కారువారి పాట’ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఇవే కాకుండా మెగాస్టార్‌ చిరంజీవి-బాబీ, పవన్‌-హరీశ్‌ శంకర్‌, బాలయ్య-గోపీచంద్‌ మలినేని, ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌.. అలాగే ప్రభాస్‌తో సైతం భారీ ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని