అందరినీ నవ్విస్తాడు - allari naresh on bandaru bullodu release
close
Published : 23/01/2021 08:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరినీ నవ్విస్తాడు

హైదరాబాద్‌: ‘‘సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాల్నీ ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేశారు. ఇప్పుడు అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి మా ‘బంగారు బుల్లోడు’తో వస్తున్నాం’’ అన్నారు అల్లరి నరేష్‌. ఇది ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం. గిరి పాలిక దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. పూజా జవేరి కథానాయిక. ఈనెల 23న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ప్రముఖ దర్శకులు మెహర్‌ రమేష్‌, అజయ్‌ భూపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నరేష్‌ మాట్లాడుతూ ‘‘పల్లెటూరి నేపథ్యంగా వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. సినిమాలో స్వర్ణ కార్మికుల కష్టాన్ని, వారి వృత్తిని గొప్పగా చూపించాం. ఎక్కడా వారిని కించపరిచేలా ఉండదు. అందరినీ నవ్వించేలా ఉంటుంద’’న్నారు. ‘‘నన్ను నమ్మి నాకీ అవకాశమిచ్చిన నరేష్‌, నిర్మాతలకి ధన్యవాదాలు. సాయి కార్తీక్‌ సంగీతం, సతీష్‌ ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో అమ్మిరాజు, కె.యల్‌.దామోదర ప్రసాద్‌, ప్రవీణ్‌, సతీష్‌ ముత్యాల, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నవ్వించడమే కాదు.. ఏడిపించడమూ తెలుసు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని