అప్పుడు బన్నీ అండగా నిలిచాడు - allu arjun is like family says bunny vasu
close
Published : 14/03/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు బన్నీ అండగా నిలిచాడు

నిర్మాత బన్నీవాసు

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ తనని ఓ కుటుంబ సభ్యుడిలా చూస్తాడని ప్రముఖ నిర్మాత బన్నీవాసు తెలిపారు. ‘గీత గోవిందం’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి విజయాలను అందుకున్న బన్నీ వాసు ఇటీవల నిర్మించిన సినిమా ‘చావుకబురు చల్లగా’. కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న చిత్రనిర్మాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘18 సంవత్సరాల క్రితం బన్నీ, నేనూ యానిమేషన్‌ నేర్చుకున్నాం. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సుకుమార్‌ చెప్పిన ‘100%లవ్‌’ కథ వినగానే.. దానికి నిర్మాతగా నేనే సెట్‌ అవుతానని బన్నీ నమ్మాడు. అలా ప్రారంభమైన నా ప్రయాణం విజయపథంలో కొనసాగుతోంది. ఇప్పటికీ నేను నిర్మాతగా వ్యవహరించే ఏ చిత్రానికి అయినా మా ఇద్దరి నిర్ణయం తప్పకుండా ఉంటుంది. ‘చావుకబురు చల్లగా’ ప్రాజెక్ట్‌కు కూడా అదే జరిగింది. ఒకవేళ మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ప్రాజెక్ట్‌ నచ్చకపోయినా నేను ఒప్పుకోను. డిసెంబర్‌లో నా సోదరుడు ప్రసాద్‌ కన్నుమూశాడు. దాంతో నేను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యాను. అప్పుడు బన్నీనే నాకు అండగా నిలిచాడు. నన్ను ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నాడు’’అని బన్నీవాసు వెల్లడించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని