బన్నీ ఊరమాస్‌ లుక్‌ @ మూడున్నర గంటలు - allu arjun long tan makeup
close
Published : 24/02/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ ఊరమాస్‌ లుక్‌ @ మూడున్నర గంటలు

తొలగించడానికి గంటన్నర

హైదరాబాద్‌: పాత్ర ఏదైనా దానిలో ఒదిగిపోయే క్రమంలో నటీనటులు ఎంతో శ్రమిస్తుంటారు. కథకు అనుగుణంగా తమని తాము ప్రేక్షకుల ఎదుట ఆవిష్కరించడం కోసం కొంతమంది శరీరాకృతి, మరికొందరు మేకప్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథానాయకుడు, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం కథానుగుణంగా మెప్పించేందుకు ఎన్నో రకాల మార్పులకు ఓకే అంటుంటారు. అలా ఆయన ఇప్పటికే ‘బద్రినాథ్‌’ కోసం పొడవాటి జుట్టుతో కనిపించగా.. ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ కోసం హెయిర్‌ స్టైల్‌లో కొంచెం విభిన్నతను చూపించారు. యాంగ్రీ లుక్‌తో రఫ్‌గా కనిపించారు.

ఇక బన్నీ తన తదుపరి సినిమా ‘పుష్ప’ కోసం మేకప్‌పై ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో ఆయన పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. స్మగ్లర్‌గా కనిపించడం కోసం రోజులో దాదాపు మూడున్నర గంటల సమయం వెచ్చిస్తున్నారట. శరీయ ఛాయ నల్లగా కనిపించడం, మేకప్‌ కోసం రెండు గంటలు సమయాన్ని కేటాయిస్తున్నారట. ఇక ఈ మేకప్‌ను తొలగించాలంటే మరో గంటన్నర పడుతోందట. లుక్‌ కోసమే ఎక్కువ సమయం పడుతుండడంతో బన్నీ ప్రతిరోజూ షూట్‌కు కొంచెం ముందుగానే వచ్చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

సుకుమార్‌ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. బన్నీ-సుకుమార్‌ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని