ఇది.. అల్లు అర్జున్ తొలిచూపు ప్రేమకథ
ఇంటర్నెట్ డెస్క్: లవర్‌బాయ్‌గా అల్లు అర్జున్ ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌తో తొలి చూపు ప్రేమ(లవ్ ఎట్ ఫస్ట్ సైట్)లో పడ్డాడు. అలా హీరోయిన్ను కూడా ప్రేమలోకి దింపిన బన్నిది నిజ జీవితంలోనూ ప్రేమ వివాహమనే విషయం చాలామందికి తెలుసు. కానీ.. అసలు అల్లు అర్జున్-స్నేహరెడ్డి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయంతో పాటు బన్నిది తొలి చూపు ప్రేమ అనేది చాలా మందికి తెలియని విషయం. గత నెల మార్చి 6న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ వేదికగా పదో వార్షికోత్సవం చేసుకుంది.
చాలామంది సెలెబ్రిటీల్లా బన్ని-స్నేహ జంటకు చిన్ననాటి పరిచయం లేదు. కట్ చేస్తే.. అమెరికాలో జరుగుతున్న ఒక శుభాకార్యానికి బన్ని వెళ్లాడు. హీరో వెళ్లిన తర్వాత హీరోయిన్ రావాలి కదా.. అనుకోకుండా స్నేహారెడ్డి కూడా సరిగ్గా ఆ వేడుకకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక స్నేహితుడు బన్నికి స్నేహను పరిచయం చేశాడు. అక్కడే మనోడి బ్యాచులర్లైఫ్కు బైబై చెప్పేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. తొలిచూపులోనే స్నేహతో ప్రేమలో పడ్డాడు బన్ని. ఆ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేదు. ఆ శుభకార్యం తర్వాత మళ్లీ వాళ్లద్దరూ మాట్లాడుకుంది లేదు. కానీ.. బన్ని మాత్రం స్నేహను మర్చిపోలేకపోయాడు. దగ్గరి స్నేహితుడు ఒకరు.. ‘నీ మనసులోని మాట ఆమెకు చెప్పు’ అంటూ ఒత్తిడి తెచ్చాడు. అలా బన్ని స్నేహకు ఒక మెసేజ్ చేశాడు. అటు నుంచి కూడా స్పందన వచ్చింది. మళ్లీ ఒకసారి కలుసి మాట్లాడుకోవాలని అనుకున్నారు. అలా.. ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకునేందుకు పలుమార్లు కలుసుకొని మాట్లాడుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సినిమా హీరో అయితే ఏంటి..?
సినిమా హీరో అయినంత మాత్రాన తన ప్రేమకు అడ్డంకులు రాకూడదా..? ఈ పెద్దలు పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు కదా.. ఇద్దరి ఇంట్లోనూ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ.. బన్ని-స్నేహ మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పేశారు. చివరికి పిల్లల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు దిగి వచ్చారు. కూర్చొని మాట్లాడారు. అలా.. 2010 నవంబర్ 26న ఘనంగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్ని పెళ్లి మరిచిపోలేనంత వైభవంగా జరిగింది.
ఇప్పుడు ఇలా..
తర్వాత 2014లో ఈ జంట శిశువుకు జన్మనిచ్చింది. అల్లు అయాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు కూతురు పుట్టడంతో బన్నిది పరిపూర్ణమైన కుటుంబంగా మారింది. అల్లువారి ముద్దుల కూతురికి అర్హ అని పేరు పెట్టారు. ఇప్పుడు.. బన్ని ఎంత బిజీగా ఉన్నా వీలు కల్పించుకొని మరీ తన కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తుంటాడు. తన పిల్లలతో సరదాగా ఆడుకునే దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకుంటాడు. ఇదీ మన బన్నీ ముచ్చట.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
గుసగుసలు
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..