బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్రశాంత్‌ రెడీ? - allu arjun meets kgf director prashanth neel in hyderabad
close
Published : 10/03/2021 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్రశాంత్‌ రెడీ?

మరో స్టార్‌హీరోతో సినిమాకి రంగం సిద్ధమేనా?

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’తో సాలిడ్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఆ సినిమా విజయంతో ఆయన ఖ్యాతి ప్రపంచం నలుదిశలకు పాకింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్‌హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

‘సలార్‌’ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు ప్రశాంత్‌నీల్‌. గత కొన్నిరోజులుగా ‘సలార్‌’ షూట్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్‌నీల్‌.. తాజాగా అల్లు అర్జున్‌ని కలిశారు. గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన కొంత సమయం పాటు బన్నీతో ముచ్చటించారు. బన్నీ కార్యాలయం నుంచి ప్రశాంత్‌నీల్‌ బయటకు వస్తోన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆయన త్వరలోనే బన్నీతో సినిమా ప్రకటించే అవకాశాలున్నాయంటూ అందరూ చెప్పుకొంటున్నారు. మరోవైపు బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ షూట్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత  కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ కొత్త కాంబో గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని