pushpa: డిసెంబరులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ విడుదల కష్టమేనా? - allu arjun pushpa faces these hurdles for release
close
Updated : 28/09/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

pushpa: డిసెంబరులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ విడుదల కష్టమేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు కరోనా పరిస్థితులు, మరోవైపు ఇండస్ట్రీలో సమస్యల కారణంగా పెద్ద సినిమాలన్నీ విడుదల వాయిదా పడుతున్నాయి. తాజాగా ‘పుష్ప’ చిత్ర బృందానికి మరో సమస్య వచ్చి పడింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న  ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది.

ఇటీవల ‘పుష్ప’ షూటింగ్‌ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకొంది. ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాల్సి ఉంది. ఈలోగా ‘గులాబ్‌’ తుపాన్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడం చిత్ర బృందానికి సవాల్‌గా మారింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, అక్టోబరు చివరి నాటికి షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విడుదల తేదీపైనా చిత్ర బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ‘పుష్ప’ టీమ్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని