Allu Arjun: బన్నీకి కరోనా పాజిటివ్‌ - allu arjun tests positive for covid
close
Updated : 28/04/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: బన్నీకి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లు, ఇతర నటీనటులు వైరస్‌ బారినపడగా తాజాగా కథానాయకుడు అల్లు అర్జున్‌ సైతం ఆ జాబితాలో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు.

‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవసరమైన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ వెంటనే పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాను. అవకాశం వస్తే తప్పకుండా అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. మరోవైపు ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈసినిమాలో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని