Allu Arjun: అన్న సినిమా సెట్‌లో బన్నీ సందడి.. ఫొటోలు వైరల్‌ - allu arjun visits ghani set
close
Published : 24/07/2021 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: అన్న సినిమా సెట్‌లో బన్నీ సందడి.. ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్‌లో బన్నీ సందడి చేశారు. శుక్రవారం ఉదయం సెట్‌లోకి అడుగుపెట్టిన ఆయన చిత్రబృందంతో ముచ్చటించారు. మరోవైపు ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి నిర్మాతగా అడుగుపెడుతున్న తన సోదరుడు బాబీ, బావ సిద్ధూలకు బన్నీ శుభాకాంక్షలు తెలిపారు. బాబీని నిర్మాతగా చూడడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు.

‘నా బ్రదర్‌ వరుణ్‌తేజ్‌, దర్శకుడు కిరణ్‌ కొర్రపాటితోపాటు ఇతర చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాలో వరుణ్‌ లుక్‌ అదిరిపోయింది. అలాగే, చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఇద్దరు కొత్త నిర్మాతలకు (బాబీ, సిద్ధూ) నా అభినందనలు. ‘గని’తో మొదటి అడుగులోనే మీరు విజయం అందుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. బాక్సింగ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌  విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి సాయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్రా కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని