వరుసగా పదో రాత్రి కూడా...  - also the tenth night in a row ...
close
Published : 13/02/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా పదో రాత్రి కూడా... 


ఇంటర్‌నెట్‌ డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం స్పై థ్రిల్లర్‌ నేపథ్యంగా ‘ధకాడ్’‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో నుంచి ఓ స్టిల్‌ని ట్వట్టర్లో షేర్ చేసింది. ఇది వరుసగా పదో రోజు రాత్రి. నాన్‌ స్టాప్‌ యాక్షన్‌ చిత్రంగా వస్తోన్న చిత్రం కోసం వరుసగా పదోరోజూ షిప్టులోనూ 14 గంటల పాటు షూటింగ్‌ జరిగిందని తెలిపింది.

కంగనా ఇందులో ఏజెంట్‌ అగ్ని పాత్రలో నటిస్తోంది. రజ్నీష్‌ ఘాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అర్జున్ రాంపాల్‌ రుద్రవీర్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్‌ 1, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ మధ్య తన గురించి కంగనా మాట్లాడుతూ..‘‘నేను బహిరంగ చర్చకు సిద్ధం. నేను పోషించని పాత్ర లేదు. నాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అవి ఆవిష్కరించే ప్రతిభ కూడా ఉంది. నేను అన్నీ పాత్రలు చేయగలను. గాల్ గోడేట్‌లా యాక్షన్‌తో పాటు గ్లామర్‌ పాత్రల్లోనూ సత్తా చాటగలను’’ అని తెలిపింది.

ఇదీ చదవండి

 ప్రభాస్‌ లవ్‌ స్టోరీ.. ముహూర్తం ఫిక్స్‌
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని