Amara Raja: అమరరాజాకు హైకోర్టులో ఊరట - amararaja in ap high court
close
Updated : 06/05/2021 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amara Raja: అమరరాజాకు హైకోర్టులో ఊరట

అమరావతి: తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ నేతృత్వంలోని అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా ప్లాంట్‌ను మూసేయాలంటూ ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమరరాజా యాజమాన్యం హైకోర్టులో సవాల్‌ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్‌ 17 లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని పరిశ్రమకు ఆదేశాలిచ్చింది. జూన్‌ 17 తర్వాత పరిశ్రమలో మళ్లీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని పీసీబీకి న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని