శ్మశానవాటిక ముందు మృతదేహాలతో క్యూ! - amid coivd restrictions imposed by delhi govt bodies lined up for cremation outside ghaziabad
close
Published : 17/04/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్మశానవాటిక ముందు మృతదేహాలతో క్యూ!

ఘజియాబాద్‌: కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతితో ఆసుపత్రులే కాదు.. శ్మశానవాటికలు కూడా నిండిపోతున్నాయి.  అంత్యక్రియల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో దహన సంస్కారాలు ఆలస్యమై భారీ సంఖ్యలో మృతదేహాలు ఓ శ్మశానవాటిక వెలుపలే నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని హిండన్‌ శ్మశానవాటికలో కనిపించిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

భౌతిక దూరంలో భాగంగా ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. ఫలితంగా అంతకుమించి మృతదేహాలు శ్మశానవాటికకు వస్తే బయటనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే అధికసంఖ్యలో మృతదేహాలు రావడంతో వాటిని బయటనే వరుసగా పెట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని