A1Express: ఆమీగో ఫుల్‌ వీడియో వచ్చేసింది - amigo full video song
close
Published : 30/04/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

A1Express: ఆమీగో ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది. త్వరలోనే డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఆమీగో’ ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సందీప్‌, లావణ్య హావభావాలు, పాట మధ్యలో వినిపించే వీళ్ల మాటలు ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని ఇన్నో జెంగా ఆలపించారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించారు. హాకీ నేపథ్యంలో దర్శకుడు డేనియస్‌ జీవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని