ఆమిర్‌ ఖాన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌
close
Published : 01/07/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమిర్‌ ఖాన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

నటుడికి నెగటివ్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయంపై ఆమిర్‌ ఖాన్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. తన సిబ్బందిలో కొంత మందికి కరోనా సోకడంతో అందరికి పరీక్షలు నిర్వహించామన్నారు. తనకు నెగటివ్‌ వచ్చిందని, తన తల్లి కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. 

‘‘అందరికీ నమస్కారం, నా వద్ద ఉండే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని క్వారంటైన్‌కు పంపించాం. సమాచారం ఇవ్వగానే బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) స్పందించి వారికి వైద్య సేవలు అందించడంలో సహాయపడింది. నా మిగతా సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా నాతో సహా అందరికీ నెగటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నా తల్లికి కరోనా పరీక్షలు జరిగాయి. తనకు నెగటివ్‌ రావాలని మీరంతా ప్రార్థించండి. మాకు సహాయపడిన బీఎంసీకి, వైద్య పరీక్షలు నిర్వహించిన కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు’’అని ఆమిర్‌ తన ప్రకటనలో పేర్కొన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని