మోదీ నాయకత్వం వల్లే టీకా సాకారం: షా - amit shah and harsh vardan on corona virus vaccine
close
Published : 03/01/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ నాయకత్వం వల్లే టీకా సాకారం: షా

దిల్లీ: భారత్‌లో కరోనా టీకా వినియోగానికి అనుమతి లభించడంపై పలువురు కేంద్రమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్‌ కరోనా రహిత దేశంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. భారత్‌కు ఇది ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కరోనా టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వపై ప్రశంసలు కురిపించారు. భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేశారని తెలిపారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ వంటి దార్శనికుడి నాయకత్వం దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లగలదని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు విజయవంతమవుతుండటంతో మోదీ ప్రతిపాదించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కీలక మలుపు తిరిగిందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ముందున్న శాస్త్రవేత్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది సహా ఇతర అత్యవసర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి నిస్వార్థ సేవలకు యావత్తు దేశం రుణపడి ఉంటుదని షా వ్యాఖ్యానించారు.

* ‘ప్రధాని మోదీ నేతృత్వంలో కొవిడ్‌-19పై భారత్‌ చేస్తున్న పోరులో ఇది ఒక మైలు రాయి. సీరం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ రెండు టీకాలు అందుబాటులోకి రావడం కరోనా పోరులో ముందున్న వారి సేవలకు ఒక గుర్తింపు లాంటిది. ఈ విజయం కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు శుభాకాంక్షలు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అభినందనలు తెలిపారు.  

ఇదీ చదవండి

భారత్‌లో టీకా వచ్చేసిందిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని