కరోనాను జయించిన అమితాబ్‌ ‌.. కానీ - amithab bachan discharge form hospital recovering from corona
close
Updated : 02/08/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను జయించిన అమితాబ్‌ ‌.. కానీ

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కరోనాను జయించారు. 77ఏళ్ల వయసులోనూ ధైర్యంతో కరోనాపై పోరాడి విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే, తాను మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదని ఇంకొంత సమయం ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.

‘‘నా తండ్రికి తాజాగా చేసిన కొవిడ్‌-19 పరీక్షలు నెగిటివ్‌ రావడం సంతోషంగా ఉంది. ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ నేను ఇంకా దాని నుంచి కోలుకోలేదు. అందుకే ఇంకా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నా. మా కుటుంబం కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ మరోసారి కృతజ్ఞతలు. కరోనాను జయించి దృఢంగా మీ ముందు నిలబడతానని వాగ్దానం చేస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.

ఇటీవల అమితాబ్‌ సతీమణి జయా బచ్చన్‌ మినహా కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యలు కోలుకున్నారు. తాజాగా అమితాబ్‌ కూడా కోలుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని