కార్టూన్లందు.. అమూల్‌ కార్టూన్లు‌ వేరయా! - amul milk cartoons on various issues
close
Updated : 19/03/2021 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్టూన్లందు.. అమూల్‌ కార్టూన్లు‌ వేరయా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే అమూల్ సంస్థ‌ పేరు చెప్పగానే ఆ బ్రాండ్‌పై కనిపించే అమూల్‌ గర్ల్‌ గుర్తొస్తుంది. ఈ సంస్థ దేశంలో.. ప్రపంచంలో జరిగే ఘటనలు, సందర్భానుసరంగా అమూల్‌ గర్ల్‌తో కలిపి ప్రత్యేక కార్టూన్లు రూపొందించి ట్విటర్‌లో పోస్టు చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో గోల్స్‌ విషయంలో పీలే(770 గోల్స్‌)రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. దానికి సంబంధించి పీలే, రొనాల్డో, అమూల్‌ గర్ల్‌ వెన్న పట్టుకొని నిల్చున్న కార్టూన్‌ను అమూల్‌ ట్వీట్‌ చేసింది. అంతకుముందు నటుడు ఆదర్శ్‌ గౌరవ్‌ బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులకు నామినేట్‌ అయిన సందర్భంగా కార్టూన్‌ పోస్టు చేసింది. అలాగే, టీమిండియా పేసర్‌ బుమ్రా వివాహం సందర్భంగా పెళ్లిపీటలపై కూర్చున్న ఆ దంపతుల కార్టూన్‌ను, ప్రిన్స్‌ హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించిన నేపథ్యంలో వారి కార్టూన్‌ను అమూల్‌ తమదైన శైలిలో రూపొందించి, కాప్షన్స్‌ పెట్టింది. అలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో అమూల్‌ పోస్టు చేసిన కార్టూన్లను చూద్దామా??

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని