స్టార్‌హీరో మూవీస్‌.. రెజీనా కామెంట్స్‌ - an actor should be able to break stereotypes
close
Published : 28/02/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టార్‌హీరో మూవీస్‌.. రెజీనా కామెంట్స్‌

ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు

హైదరాబాద్‌: ‘ఎస్‌ఎంఎస్‌ (శివ మనసులో శ్రుతి)’ చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన చెన్నై చిన్నది రెజీనా. మొదటి చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన ఆమె టాలీవుడ్‌తోపాటు పలు దక్షిణాది  సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో  మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘చక్ర’లో ఆమె నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు.

కాగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘ఒక నటిగా కేవలం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే విభిన్న కథాచిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాను. అందులో భాగంగానే ‘ఎవరు’, ‘అ!’, ఇప్పుడు ‘చక్ర’ చిత్రాల్లో భాగమయ్యాను. సాధారణంగా ఏదైనా కథను ఎంపిక చేసుకున్నప్పుడు.. అందులో కథ ఏంటి? నా పాత్ర ఎలాంటి?అది ప్రజల్ని ఎంతవరకూ ప్రేరేపిస్తుంది? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. అలాగే పాత్రకు అనుగుణంగా శారీరకంగా, మానసికంగా నన్ను నేను పూర్తిగా మార్చుకుంటాను. కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో రొమాంటిక్‌, ప్రేమకథా చిత్రాల్లో నటించాలనుకున్నాను. కానీ ఇప్పుడు క్రైమ్‌, థ్రిల్లర్‌ కథాంశాలపై ఆసక్తి పెరిగింది.’’

అనంతరం రెజీనా స్టార్‌హీరో చిత్రాల్లో నటించకపోవడం గురించి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకూ ఎంతో మంది యువ కథానాయకులతో స్క్రీన్‌ పంచుకున్నాను. అయితే, అగ్రహీరోల సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఇప్పటికే నా స్నేహితులు, కుటుంబసభ్యులు, పరిశ్రమలోని వారు, అభిమానులు.. ఇలా ఎంతో మంది నన్ను ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు. ఎందుకంటే స్టార్‌హీరోల సినిమాల్లో ఎందుకు భాగం కాలేకపోయాననే విషయాన్ని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఓటీటీ ప్రవేశంతో సినిమా పరిధి మరింత పెరిగింది. మంచి కథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథా చిత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి ఇప్పటికైనా స్టార్‌హీరోల చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు? లేదా వాళ్ల ప్రాజెక్ట్‌ల్లో ఆఫర్స్‌ ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నలు అడగరని ఆశిస్తున్నా.’’ అని రెజీనా వివరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని