CoronaVaccine: భయంతో అడవిలో దాక్కున్న వృద్ధురాలు - an old woman hiding in the bushes for fear of dying if vaccinated
close
Updated : 29/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVaccine: భయంతో అడవిలో దాక్కున్న వృద్ధురాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో ఓవైపు క‌రోనా టీకాల కొరత వేధిస్తుంటే.. మరోవైపు వ్యాక్సిన్లపై పలు ప్రాంతాల్లో వదంతులు వస్తూనే ఉన్నాయి. టీకా వేసుకుంటే చనిపోతాననే భయంతో ఓ వృద్ధురాలు అడవిలో దాక్కున్న ఘటన రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో జరిగింది. కిరత్‌పురా సమీపంలోని అడవిలో ఒక వృద్ధురాలి శవం ఉందని పక్కనే పొలాల్లో పనిచేసే ఓ వ్యక్తి స్థానికులకు సమాచారం అందించారు.  అక్కడికి చేరుకున్న స్థానికులు వృద్ధురాలు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా, తనకు టీకా వేయొద్దంటూ ఆవిడ చేతులు జోడించి వేడుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతానని వారితో చెప్పారు. చివరకు అతి కష్టం మీద స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. కొందరు కావాలనే వ్యాక్సిన్పై దుష్ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని