Anand Mahindra: ఒసాకా..‘ముంబయి మోడల్‌’ను  ప్రయత్నించు! - anand mahindra points to mumbai model
close
Published : 26/05/2021 19:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Mahindra: ఒసాకా..‘ముంబయి మోడల్‌’ను  ప్రయత్నించు!

భారత్‌ను విమర్శించడం ఆగిపోవాలని ట్వీట్‌

ముంబయి: కరోనావైరస్ తగ్గినట్టే తగ్గి, అనేక దేశాల్లో పలుమార్లు తన ఉనికి చాటుకుంటోంది. తాజాగా ఒసాకా నగరంలో వైరస్‌ ఉద్ధృతి జపాన్‌ను కలవరపెడుతోంది. మరోవైపు ఎప్పుడు వర్తమాన అంశాలతో నెటిజన్లను పలకరించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా..ఇప్పుడు జపాన్‌కు సలహా ఇచ్చారు. కరోనా కట్టడికి ‘ముంబయి మోడల్‌’ను అనుసరించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కరోనా మహమ్మారిపై పోరాటంలో, వైద్యసౌకర్యాలపరంగా ‘జపాన్‌ మోడల్‌’ అద్వితీయమైంది. అయితే ప్రపంచంలో ఏ ఒక్కరు సురక్షితంగా లేరు. భారత్‌ను విమర్శించడం ఆగిపోవాలి. మనమంతా కలిసికట్టుగా ప్రపంచాన్ని కరోనా నుంచి బయటపడేయాల్సి ఉంది. ఆ విషయాన్ని అందరు అర్థం చేసుకోవాలి. ఒసాకా నగరం ‘ముంబయి మోడల్‌’ని అనుసరించేందుకు ప్రయత్నించాలి’ అని ట్వీట్ చేశారు. 

ప్రపంచంలో అనేక దేశాలు కరోనా ఉప్పెనలో మునిగిపోతుంటే..జపాన్‌ ఆ ఇన్ఫెక్షన్‌ను కట్టడిచేసింది. కానీ, తాజాగా రెండోపెద్ద నగరమైన ఒసాకాలో వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే..వైద్యసేవలు అందడం కష్టమైపోతుందని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, మొదటి దశ ఉద్ధృతి నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబయి నగరం..రెండో దశలో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరిలో ఆ నగరంలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరగడం ప్రారంభమైంది. అయితే మే తరవాత నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చి, కేసులు తగ్గుముఖం పట్టాయి. ‘కచ్చితమైన ప్రణాళిక, సత్వర చర్యలు, స్మార్ట్ పద్ధతిలో సమాచార మార్పిడి, అవసరమైన చోట ఖర్చుపెట్టేందుకు ముందుకురావడం’ వంటి చర్యల వల్లే కొవిడ్‌ను కట్టడి చేయగలిగామని ఆ నగర కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ ముంబయి మోడల్‌కి సుప్రీం కితాబివ్వడం విశేషం. ఇప్పుడు ఈ విధానాలనే అనుసరించాలని మహీంద్రా ఒసాకా నగర యంత్రాంగానికి సూచించారు. 

కాగా, ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు పలికారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని