భయపడుతూనే అడుగుపెట్టా   - ananya pandey about her new movie shooting after lockdown
close
Published : 02/11/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపడుతూనే అడుగుపెట్టా 

ముంబయి: కరోనా ప్రభావం ఓ పక్క కొనసాగుతున్నా జాగ్రత్తలు తీసుకుంటూ సెట్లోకి అడుగుపెడుతున్నారు సినీ తారలు. బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్యా పాండే చాలా నెలల తర్వాత చిత్రీకరణలో పాల్గొంది. షకున్‌ భత్రా దర్శకత్వంలో ఆమె నటిస్తున్న సినిమా   చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. దీపికా పదుకొణె, సిద్ధాంత్‌ చతుర్వేది కీలక పాత్రలు పోషిస్తున్నారు. తను సెట్లో అడుగుపెట్టే ముందు చాలా భయపడిపోయానని చెబుతోంది అనన్య.

‘‘సెట్లోకి అడుగుపెట్టే ముందు చాలా ఆందోళనకు గురయ్యా. సెట్లోకి వచ్చాకా అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు నాకు భరోసా నిచ్చాయి. నేను జాగ్రత్తగా ఉంటూ చిత్రీకరణ చేస్తూనే నా చుట్టూ ఉన్నవారిని రక్షించుకోవడం నా ముందున్న ప్రధాన కర్తవ్యం’’అని చెప్పింది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో నటిగా కెరీర్‌ మొదలుపెట్టింది అనన్య. ఆ తర్వాత ఆమె నటించిన ‘పతి పత్నీ ఔర్‌ ఓ’ మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత ఆమె నుంచి వచ్చిన ‘ఖాలీ పీలీ’ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది.

‘‘వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లోకి వెళుతుండటం నా అదృష్టం. నా తొలి చిత్రం తర్వాత నటించిన రెండు చిత్రాలు వైవిధ్యంగా సాగేవే. నాకు మంచి పేరు తెచ్చాయి. నటిగా నా సుదీర్ఘ ప్రయాణం ఇలాగే కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను’’అని చెప్పింది అనన్య. ఆమె ప్రస్తుతం విజయ్‌దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా స్థాయి చిత్రంలో నాయికగా నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని