‘ఖిలాడి’తో అనసూయ ఆట - anasuya in khiladi
close
Published : 04/02/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’తో అనసూయ ఆట

హైదరాబాద్‌: బుల్లితెరపై వ్యాఖ్యాతగా.. వెండితెరపై నటిగా వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది అనసూయ. ఇప్పుడామె ‘ఖిలాడి’తో ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రమేష్‌ వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం అనసూయను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. కథని మలుపు తిప్పే ఓ కీలక పాత్రను ఆమె పోషించబోతుందని తెలిపింది. అంతేకాదు ఆమె ఇందులో రవితేజతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుందట. ఓ వైవిధ్యభరిత యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రవితేజ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఇదీ చదవండి

ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని