అనసూయ మరోసారి ఫిదా చేయనుందా? - anasuya roped in for a special song in maha samudram
close
Updated : 22/03/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ మరోసారి ఫిదా చేయనుందా?

హైదరాబాద్‌: ‘పైన పటారం.. లోన లోటారం’ అనే పాటతో ఇటీవల కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి అనసూయ. బుల్లితెర వ్యాఖ్యాతగానే కాకుండా రంగమ్మత్తగానూ ప్రేక్షకులకు చేరువైన ఈ నటి.. సినిమాల్లో కీలకపాత్రలు పోషించడంతో పాటు అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘చావుకబురు చల్లగా’లో మెప్పించారు. కాగా, అనసూయ మరోసారి సినీ ప్రియుల్ని అలరించనున్నట్లు సమాచారం.

శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే చిత్రబృందం అనసూయను సంప్రదించినట్లు సమాచారం. దీంతో ‘మహా సముద్రం’లో అనసూయ భాగమైందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని