మరో ప్రత్యేక పాటలో యాంకర్‌ అనసూయ! - anchor anasuya special song in chavu kaburu challaga
close
Published : 15/02/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ప్రత్యేక పాటలో యాంకర్‌ అనసూయ!

హైదరాబాద్‌: ఒకవైపు యాంకరింగ్‌, రియాల్టీషోలు చేస్తూనే, సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది అనసూయ. తాజాగా ‘చావు కబురు చల్లగా’ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటలో ఆమె డ్యాన్స్‌ చేయనుంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 19న ‘చావు కబురు చల్లగా’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా జరిగిన ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌లో అనసూయ పాల్గొంది.

అనసూయ గతంలో నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయన’లో ఆడిపాడింది. సాయితేజ్‌ ‘విన్నర్‌’చిత్రంలోనూ ఒక ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది. ఆ పాటను మరో ప్రముఖ యాంకర్‌ సుమ పాడటం విశేషం. ఇప్పుడు ఈ చిత్రంలో అనసూయ నర్తిస్తున్న సాంగ్‌ ఖచ్చితంగా మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం అంటోంది. జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని