గబ్బా టెస్టు.. ముందే చెప్పిన మంచు విష్ణు - and india will win this test match will be a nail biter says manchu vishnu
close
Published : 20/01/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బా టెస్టు.. ముందే చెప్పిన మంచు విష్ణు

భారతజట్టుకు సినీ ప్రముఖుల అభినందనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా.. క్రికెట్‌.. ఈ రెండింటినీ ఇష్టపడని వారుంటారా..? సినిమా హీరోల్లో కూడా క్రికెట్‌ అభిమానులుంటారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో భారత్‌ విజయం సాధించింది. ట్రోఫీ గెలిచి మరోసారి తన సత్తా చాటిన టీమ్‌ఇండియాకు పలువురు సినీతారలు అభినందనలు చెప్పారు. అందులో ముఖ్యంగా మంచు విష్ణు గురించి చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌ను భారత్‌ గెలుచుకుంటుందని హీరో మంచు విష్ణు ముందే ఊహించాడు. టీమ్‌ ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని, ఈ టెస్టు మ్యాచ్‌ అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తుందని ఓ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత కూడా మరో ట్వీట్‌ చేశాడు. నిజంగానే ఆయన చెప్పినట్లుగానే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. దీంతో ‘మొత్తానికి మనం సాధించాం. అద్భుతమైన విజయం..’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

* ‘గబ్బాను జయించారు. సిరీస్‌ను 2-1తో గెలిచిన చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేది. చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గర్వంగా ఉంది’ - మహేశ్‌బాబు 

* ‘ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అద్భుతమైన విజయం సాధించింది. కుర్రాళ్లు బాగా ఆడారు. గర్వంగా ఉంది’ - విక్టరీ వెంకటేశ్‌

* ‘చరిత్ర. టెస్టు క్రికెట్‌ గొప్పతనం ఇదే’ - సుధీర్‌బాబు

* ‘ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది టిమ్‌ పైన్‌కు అంకితం. మామీద మీరు ఎలా దాడిచేసినా మీకు ప్రతిఫలం చూపించాం. మీ కీపింగ్‌కు ధన్యవాదాలు. భారత యువఆటగాళ్లంతా బాగా ఆడారు’ - సిద్ధార్థ్‌

* ‘భారత్‌ చరిత్ర సృష్టించింది. 36ఆలౌట్‌ నుంచి 2-1సిరీస్‌ విజయం వరకూ.. యువప్రతిభ మెరిసింది.. ఐక్యత సాక్షాత్కరించింది.. చరిత్ర తిరిగి రాయబడింది’’    - ఆర్‌ఆర్‌ఆర్‌

* ‘ఇండియా.. ఇండియా.. గొప్ప విజయం. భారత్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి’ - అమితాబ్‌బచ్చన్‌

* ‘హోమైగాడ్‌. అద్భుతమైన విజయం ఇది. ఈ విజయంతో భారత్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకుంది’ - ప్రీతిజింటా

* ‘మన జట్టుకు ఎంత అద్భుతమైన విజయం. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ చారిత్రక క్షణాన్ని అందరూ ఆనందించండి. కుర్రాళ్లకు అభినందనలు. చక్ దే ఇండియా’ - షారుఖ్‌ ఖాన్‌

* ‘అద్భుతమైన ప్రదర్శన చేసిన భారతజట్టుకు అభినందనలు. అన్ని ఆటంకాలను ఎదుర్కొని గెలిచి చరిత్రను సృష్టించింది. నిజంగా విజేత’ - అక్షయ్‌కుమార్‌

* ‘చరిత్రాత్మక విజయం. గర్వంగా ఉంది’ - రణ్‌వీర్‌సింగ్‌

* ‘ఇది చారిత్రాత్మక విజయం. కుర్రాళ్లు చూపించిన ప్రశాంతత, సహనం, స్థిరత్వం.. అఖిల భారతదేశం మీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది’ - అర్జున్‌కపూర్‌

ఇదీ చదవండి..

కమల్‌కి శస్త్రచికిత్స విజయవంతం

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని