మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’ - andhagadu song manasa vinava song promo release
close
Published : 19/04/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’

ఇంటర్నెట్‌ డెస్క్: అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించి తాజాగా ‘‘మనసా వినవా’’ అనే సాంగ్‌ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చిన ఈ గీతానికి శ్రీరామ చంద్ర, ధన్య బాలకృష్ణ ఆలపించగా శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని