Anee Master- Sitara: అనీ మాస్టర్‌, సితార వేసిన డ్యాన్స్‌ వీడియో చూశారా? - anee master teaches dance to sitara
close
Updated : 25/11/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anee Master- Sitara: అనీ మాస్టర్‌, సితార వేసిన డ్యాన్స్‌ వీడియో చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు గారాలపట్టి సితార.. అనీ మాస్టర్‌ దగ్గర డ్యాన్స్‌ నేర్చుకుంటోంది. ఈ సందర్భంగా అనీ మాస్టర్‌తో కలిసి ‘టకీ టకీ’ అనే పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇటీవలే బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే!  ప్రస్తుతం ఆమె సితారకు డ్యాన్స్‌ శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన గురువు అనీ గురించి సితార మాట్లాడుతూ...‘‘ థాంక్యూ మాస్టర్‌.. మీ స్టెప్స్‌కు మ్యాచ్‌ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నా.. కానీ, కుదరడం లేదు’’ అని వ్యాఖ్యానించింది. డ్యాన్స్‌ సరైన రీతిలో రాలేదని భావించిన సితార ఈ సారి ఎలాగైనా మెప్పించాలని అదే పాటకు సోలోగా స్టెప్పులు వేసింది. ‘‘ఇది బాగుందా? లేదా, మరో సారి చేయమంటారా మాస్టార్‌’’ అని అడిగింది. తొమ్మిదేళ్ల సితార చదువుతో పాటు ఇతర యాక్టవిటీస్‌లోనూ చురుకే! దర్శకుడు వంశీపైడిపల్లి తనయ ఆద్యతో కలిసి ‘ఆద్య అండ్‌ సితార’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. అందులో పండుగ విశేషాలు, ఫుడ్‌ మేకింగ్‌తో పాటు ట్రావెల్‌ స్టోరీస్‌ను అప్‌లోడ్‌ చేస్తోంది. వాటితో పాటు ఆకట్టుకునేలా కాన్వాస్‌ పెయింటింగ్స్‌ని వేస్తోంది కూడా. అంతే కాదు.. అప్పడప్పుడు అదరొగొట్టేలా ఫొటో షూట్స్‌తోనూ సందడి చేస్తోంది. 




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని