అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్‌ - anil kapoor recalls how he almost killed rahul bose in dil dhadakne do
close
Updated : 01/03/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్‌

ముంబయి: సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే హత్య సన్నివేశాలు కల్పితమే అయినా భయం గొల్పుతాయి. ముఖ్యంగా అలాంటి సన్నివేశాల్లో నటించేటపుడు నటీనటులు జాగ్రత్తగా ఉండాలి. నటనకు నిజానికి మధ్య తేడా గమనించి నటించాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు జరగొచ్చు. ఇలాంటి ఘటనే ‘దిల్‌ దడ్కనే దో’చిత్రీకరణలో క్షణాల వ్యవధిలో తప్పిపోయిందని బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘2015లో జోయా అక్తర్‌ డైరెక్షన్‌లో ‘దిల్‌ దడ్కనే దో’అనే చిత్రంలో నటించాను. అందులో ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్‌సింగ్‌లకు తండ్రిగా నటించాను. కథ అంతా ఒక క్రూజ్‌ నౌకలో నడుస్తుంటుంది. రాహుల్‌ బోస్‌ ఆ చిత్రంలో ప్రియాంకకు కాబోయే భర్తగా నటించాడు. అయితే ఓ సన్నివేశంలో అతను ప్రియాంకతో గొడవపడుతూ ఆమెను కొట్టబోయే సీన్‌ ఉంటుంది. నేను దాన్ని అడ్డుకోవాలి. ఆ క్రమంలోనే బోస్‌ని గోడకు అదిమిపెట్టి చేత్తో గొంతు నుమలాలి. కానీ, ఆ క్షణంలో ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి నిజంగానే బలంగా అతని గొంతుపై నా చేత్తో నొక్కాను. ఆ సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో నా చేతిలో ఒక వైర్‌ ఉంది. దాంతో మరింత బలంగా నొక్కేయబోయాను. సెట్‌లో వాళ్లు గమనించి కట్‌ చెప్పారు. లేదంటే దాదాపు బోస్‌ని చంపేసేవాడినేమో. ఆ సీన్‌ పూర్తికాగానే సెట్‌లోని వాళ్లంతా ‘ ఏమైందీ ఏకే.., ఇక్కడా సినిమా షూటింగ్‌ మాత్రమే జరుగుతుంది’ అంటూ నన్ను నియంత్రించారు. నా జీవితంలో అది అత్యంత దురదృష్టకరమైన సంఘటన’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సీన్‌కు సంబంధించిన వీడియోను  యూట్యూబ్‌లో ఉంచారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని