ఆ రీమేక్‌లో చిరు నటిస్తాడా? - anil sunkara produce chiru vedhalam movie
close
Updated : 07/08/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రీమేక్‌లో చిరు నటిస్తాడా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల చిరంజీవి కొందరు యువ దర్శకులతో వరసపెట్టి సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుండగా.. ఆ తర్వాత దర్శకులు సుజీత్‌/వి.వి వినాయక్‌, బాబీ సినిమాల్లో నటించనున్నారు. అయితే తాజాగా చిరంజీవి మరో సినిమా వార్త వినిపిస్తోంది. చిరు ఇదివరకు చెప్పినట్లుగానే ఇప్పుడు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. 

తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన ‘వెదాళం’ అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని చిరంజీవి లేదా పవన్‌ కల్యాణ్‌తో రీమేక్‌ చేయనున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ రీమేక్‌ చిత్రంలో చిరు నటించనున్నారని, దీనికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ రీమేక్ చిత్రానికి అనిల్‌ సుంకర (ఏకే ఎంటర్‌టైన్‌మెంట్) నిర్మాతగా వ్యవహరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెహర్‌ రమేశ్‌ ‘వెదాళం’ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారని త్వరలో ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రసీమలో అనుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 22న చిరు పుట్టిన రోజు. దీంతో చిరు సినిమా విశేషాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని