‘యానిమల్‌’ అనుబంధాలు గందరగోళంగా.. - animal movie latest news
close
Published : 26/01/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘యానిమల్‌’ అనుబంధాలు గందరగోళంగా..

ముంబయి: రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పరిణీతి చోప్రా, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రధారులు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రంలోని పాత్రల మధ్య అనుబంధాలు గందరగోళంగా ఉంటాయట. కథానాయకుడు ఎలాంటి పరిస్థితుల్లో మృగంలా మారాడు అనేది చిత్రంలో కీలకమైన అంశమట.

తాజాగా ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌ భార్యగా పరిణీతి కనిపించబోతుందని సమాచారం. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ఓ తండ్రి పాత్రలో అనిల్‌కపూర్‌, ప్రతినాయకుడిగా బాబీ దేవోల్‌ నటించనున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని