అభిమానుల‌కు మాటిస్తున్నా: అంజ‌లి - anjali about vakeelsab
close
Published : 17/05/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానుల‌కు మాటిస్తున్నా: అంజ‌లి

ఇంట‌ర్నెట్ డెస్క్‌: తన కెరీర్లో ‘వకీల్ సాబ్’ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు నాయిక అంజలి. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకుని ఇటీవల ఓటీటీలోనూ విడుదలైంది. డిజిటల్ మాధ్యమంలోనూ ఈ సినిమాకి, తన పాత్రకు (జరీనా) వస్తోన్న ఆదరణకు ఆనందం వ్యక్తం చేసింది అంజలి.

‘వకీల్ సాబ్ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలుస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి నన్ను ఆదరిస్తున్న అభిమానులకు మాట ఇస్తున్నాను. ఇకపై మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటించి, అలరిస్తాను’ అని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. హిందీ చిత్రం పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్‌ని తీసుకొచ్చారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని